English | Telugu

స‌మంత‌కి నో చెప్పిన ఫ్యామిలీ మెంబ‌ర్స్!

అప్ప‌టిదాకా అన్ని విష‌యాల్లో ఓకే చెప్పిన వారు ఉన్న‌ట్టుండి నో చెబితే ఎలా అనిపిస్తుంది? ఏం చేసినా వెరీగుడ్ అన్న‌వారు.. ఇంకొక్కసారి ఆలోచించ‌కూడ‌దా అని అంటే ఎలా స్పందించాలి? వాళ్లు అదేప‌నిగా చెబుతున్నారు క‌దా అని సైలెంట్‌గా ఉండాలా? లేకుంటే, మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు చేసేయాలా? మ‌రొక‌రో, ఇంకొక‌రో అయితే ఏం చేసేవారో తెలియ‌దు కానీ, స‌మంత మాత్రం త‌న మ‌న‌సు ఏం చెబితే అదే విన్నారు. యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ప్ర‌వ‌ర్తించారు. అందుకే ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా అంత పెద్ద హిట్ అయింది. పుష్ప‌2లో ఉ అంటావా పాట కోసం ద‌ర్శ‌కుడు సమంత‌ను అప్రోచ్ అయిన‌ప్పుడు స‌మంత ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కాస్త డిస్ట‌ర్బెన్స్ ఉంది. అప్పుడే స‌మంత‌, నాగ‌చైత‌న్య డైవ‌ర్స్ ప్ర‌క‌టించారు.

అలాంట‌ప్పుడు ఈ సాంగ్‌కి స‌మంత యాక్సెప్ట్ చేయాలా? వ‌ద్దా? అప్పుడు అదో మిలియన్ డాల‌ర్ల్ ప్ర‌శ్న‌. స‌మంత మాట్లాడుతూ ``నా లైఫ్‌లో నేను ఏ నిర్ణ‌యం తీసుకున్నా న‌న్ను ఎంకరేజ్ చేసిన వారున్నారు. నేను సూప‌ర్ డీల‌క్స్ లాంటి సినిమాలు చేస్తాన‌న్న‌ప్పుడు కూడా ఎంక‌రేజ్ చేశారు. కానీ అలాంటివారు, మ‌రీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ మాత్రం స్పెష‌ల్ సాంగ్ ఇప్పుడు అవ‌స‌ర‌మా? అని ఒక‌సారి ఆలోచించుకోమ‌న్నారు. అలా ఆలోచించుకున్నాను కాబ‌ట్టే నేను ఆ సాంగ్‌లో చేశాను. అలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ కెమెరా ముందు పెట్ట‌గ‌ల‌నా? అని న‌న్ను నేను చాలా సార్లు ప్ర‌శ్నించుకునేదాన్ని. వాట‌న్నిటికీ స్క్రీన్ మీద స‌మాధానం దొరికింది. ఆ పాట సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది`` అని అన్నారు స‌మంత‌.

ఆమె న‌టించిన శాకుంత‌లం ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నార్త్ మీడియాతో ఈ విష‌యాన్ని పంచుకున్నారు స‌మంత‌. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఆమె న‌టిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. స‌మంత అనారోగ్యం పాలు కాకుండా ఉంటే, ఈ సినిమా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. నార్త్ లో వ‌రుణ్‌ధావ‌న్‌తో సిటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్‌లో న‌టిస్తున్నారు స‌మంత‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.