English | Telugu

స‌మంత తో స‌త‌మ‌త‌మ‌వున్న తివిక్ర‌మ్‌



త్రివిక్ర‌మ్ సినిమాకి హీరోగా నితిన్ ఫిక్స‌యిపోయిన‌ట్టే. ఇప్పుడు హీరోయిన్ ద‌గ్గ‌రే అస‌లు స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఈ క‌థ‌ని త్రివిక్ర‌మ్ స‌మంత‌ని దృష్టిలో ఉంచుకొనే రాశాడ‌ని, అయితే.. ఇప్పుడు స‌మంత‌ని తీసుకోవాలా? వ‌ద్దా అనే విష‌యంలో తిక‌మ‌క‌ప‌డుతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. విష‌యానికొస్తే.. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల్లో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌టి నుంచీ త్రివిక్ర‌మ్‌, స‌మంత‌ల్ని లింకులు పెడుతూ బోలెడ‌న్ని గాసిప్పులు పుట్టుకొచ్చాయి. వీరిద్ద‌రూ స‌న్నిహితంగా మెలుగుతున్నార‌ని ఈ వ్య‌వ‌హారం త్రివిక్ర‌మ్ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లాడుకొన్నారు. అప్ప‌టి నుంచీ స‌మంత‌ని త‌న క్యాంప్‌కి దూరంగా ఉంచాల‌ని భావిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. అయితే.. ఇప్పుడు స‌మంత‌ని దృష్టిలో ఉంచుకొని రాసిన సినిమాలో ఆమెను తీసుకోవాలా, లేదంటే మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకోవాలా? అనేతి తెలియ‌క సందిగ్థానికి గుర‌వుతున్నాడు.

త్రివిక్ర‌మ్‌ది రాజీ ప‌డ‌ని ధోర‌ణి. తన క‌థ‌కు ఎవ‌రైతే న్యాయం చేయ‌గ‌ల‌రో వాళ్ల‌నే ఎంచుకొంటాడు. అలాగ‌ని ఇప్పుడు స‌మంత‌ని తీసుకొంటే... మ‌ళ్లీ పాత గాసిప్పుల‌కు ప్రాణంపోసిన‌ట్టవుతుంద‌న్న భ‌యమూ ఉంది. మ‌రోవైపు స‌మంత కూడా ఈ సినిమా కోసం నన్ను దూరం పెట్టండి అని త్రివిక్ర‌మ్‌ని అడుగుతోంద‌ట‌. స‌మంత‌ని రిప్లేస్ చేసే హీరోయిన్ కోసం త్రివిక్ర‌మ్ గ‌త నెల రోజుల నుంచీ అన్వేషిస్తున్నాడు. కానీ. ఎవ్వ‌రూ దొర‌క్క‌... మ‌ళ్లీ స‌మంత‌వైపే చూస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. మొత్తానికి ఈ మాట‌ల మాంత్రికుడి అవ‌స్థ‌.. అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంది. పుకార్ల‌కు ఎదురెళ్లి స‌మంత‌నే క‌థానాయిక‌గా ఎంచుకొంటాడా, లేదంటే క‌థానాయిక విష‌యంలో రాజీ ప‌డ‌తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.