English | Telugu
'గబ్బర్ సింగ్ 2' ఆగిపోయింది
Updated : Jul 23, 2015
గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టయిపోయి.... బ్లాక్‌బ్లస్టర్ ఖాతాలో చేరిపోయింది. ఆ తరవాత ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన వచ్చింది. దానికితోడు హిందీలోనూ దబాంగ్ 2 అంటూ సల్మాన్ భాయ్ హిట్ కొట్టాడు. ఆస్ఫూర్తితో గబ్బర్ సింగ్ 2కి ముహూర్తం ఖరారై... దర్శకుడిగా సంపత్‌నంది గబ్బర్ సింగ్ 2 స్ర్కిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి పవన్ కోసం ఎదురుచూశాడు. తీరా చూస్తే... పవన్ సంపత్‌కి హ్యాండిచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ తరవాత బాబిని రంగంలోకి దింపాడు. గబ్బర్ సింగ్ 2 కథలోనే కొన్ని మార్పులు చేర్పులూ చేశాడు. అయితే ఇది కూడా వవన్‌కి నచ్చలేదు.
దాంతో ఆ స్ర్కిప్టు పూర్తిగా పక్కన పడేసి... కొత్త కథ రాయించాడు. గబ్బర్ సింగ్ 2 కథని వాడుకోనప్పుడు ఆ టైటిల్ ఎందుకు అనుకొన్నాడేమో... దాన్నీ మార్చేసి సర్దార్ అని నామకరణం చేశాడు. పవన్ ఎత్తుగడ వెనుక రెండు కారణాలున్నాయి. గబ్బర్ సింగ్ 2 అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. గబ్బర్ సింగ్‌తో సినిమాని పోల్చి చూసుకొంటారు. వాటిని అందుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ కష్టమే. అందుకే అంచనాలు తగ్గించడానికి పవన్ టైటిల్‌లో మార్పు చేశాడు. రెండోది గబ్బర్ సింగ్ 2 అనే టైటిల్ పెడితే.. టైటిల్ కోసమే కనీసం కోటి రూపాయలు వెచ్చించాలి. ఎందుకంటే ఈ టైటిల్ షోలే నిర్మాతల దగ్గర ఉంది. ఆ హక్కుల్ని తీసుకొనే గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు అప్పట్లో. ఇప్పుడు మళ్లీ ఆ టైటిల్ వాడుకోవాలంటే మళ్లీ మరో కోటి రూపాయలు ఖర్చు చేయాలి. దాంతో పాటు సంపత్ నంది రాసిన సీన్లు వాడుకొంటున్నారన్న అపవాదు రాకుండా... పూర్తిగా ఆకథనీ ఆ పేరునీ లేకుండా చేసేసి తన తెలివితేటల్ని చూపించాడు.