English | Telugu

అఖిల్ టార్గెట్ అదే!



తొలి సినిమాతోనే రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరితే ఎలా ఉంటుంది? ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ హీరోకీ సాధ్యం కాని రికార్డ్ ఇది. రామ్‌చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత హిట్ అయినా.... వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్ని సృష్టించ‌లేక‌పోయింది. నాగ‌చైత‌న్య జోష్‌కీ ఆ అవ‌కాశం లేకుండా పోయింది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌లు ఈ మ్యాజిక్ కి చాలా దూరంలో నిల‌బ‌డిపోయారు. ఇప్పుడు ఆ ఛాన్స్ అఖిల్‌కి ద‌క్క‌బోతోంది. అఖిల్ - వినాయ‌క్ సినిమాపై ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా వ‌సూళ్ల దుమ్ము దుల‌ప‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ పండితులు అప్పుడే విశ్లేష‌ణ‌ల‌కు దిగిపోతున్నారు.

వినాయ‌క్ మార్క్ యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిక్స‌యి.. జ‌స్ట్ ఓకే అనుకొన్నా ఈ సినిమా రూ.50 కోట్లు కొల్ల‌కొట్టేయ‌డం ఖాయ‌మ‌ని లెక్క‌లు వేస్తున్నారు. అఖిల్ టార్గెట్ కూడా అదే. ప‌బ్లిసిటీ ప‌క్కాగా చేసుకొని, మాంచి హైప్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్ భారీగా రాబ‌డితే.. రూ.50 కోట్లు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అఖిల్ న‌మ్మ‌కం. నితిన్ కూడా అదే ధీమాతో ఈసినిమాకి భారీగా ఖ‌ర్చు పెడుతున్నాడ‌ని టాక్. మ‌రి అఖిల్ తొలి సినిమాకే రూ.50 కోట్లు హీరో అవుతాడో, లేదో తెలియాలంటే. ఇంకొంత కాలం ఆగాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.