English | Telugu
షూటింగ్ లో గాయపడిన సమంత
Updated : Feb 28, 2023
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఆమె ప్రస్తుతం 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్ లోని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా సమంతకు గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా సమంతనే తెలియజేసింది.
'ది ఫ్యామిలీ మ్యాన్-2'లో రాజీగా సమంత ఆకట్టుకుంది. తన యాక్షన్ తో హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఇప్పుడు 'సిటాడెల్'తో అంతకుమించి అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. దీనికోసం సమంత ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. అయితే తాజాగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సమంత చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత యాక్షన్ ఫలితం అని రాసుకొచ్చింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు జాగ్రత్త సామ్ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.