English | Telugu
ఖాన్స్ తో అంటే గేమ్సా?
Updated : Jun 3, 2015
సల్మాన్,షారుక్, అమీర్...బాలీవుడ్ లో ముగ్గురు మొనగాళ్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో పంధా. ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పోటాపోటీగా ఉంది. అలాంటిది వీళ్ల ముగ్గురూ కలసి నటిస్తే? ఏంటీ జోక్ చేస్తున్నారా?వీళ్లముగ్గుర్నీ డైరెక్ట్ చేసే ధైర్యం ఎవరికుందిలెండి అంటారా? జోక్ కాదండీ బాబూ....ఇది నిజమే అంటున్నారు బీ టౌన్ జనాలు. ఖాన్ త్రయాన్ని ఒకేసారి స్క్రీన్ పై చూపించాలని డైరెక్టర్ సాజిద్ నడియావాలా ఉత్సాహపడుతున్నాడట. గతంలో అమితాబ్, రిషీకపూర్, వినోద్ ఖన్నా కలసి నటించిన అమర్ అక్బర్ ఆంథోని తరహా్లో కథ ఉండొచ్చని చెబుతున్నారు. అయితే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఖాన్ త్రయానికి ఇచ్చే క్యారెక్టర్, పారితోషికం, చివరికి హీరోయిన్ సహా ప్రతీది వివాదాన్ని రేపుతాయి. సో ఖాన్ త్రయాన్ని డీల్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. 2017 జనవరిలో ప్రారంభించి అదే ఏడాది చివర్లో సినిమా విడుదల చేస్తానంటున్నాడు సాజిద్. ఇదే నిజమైతే ఖాన్ త్రయం ఫ్యాన్స్ కి పెద్ద పండుగే మరి.