English | Telugu
సలార్ - లియో... మధ్యలో గేమ్ ఆఫ్ థ్రోన్స్
Updated : Jun 27, 2023
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా సలార్. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ చేస్తున్న మూవీ లియో. ఈ రెండు సినిమాలకూ పాపులర్ ఇంగ్లిష్ సీరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కీ లింక్ ఉందని అంటున్నారు. ఇంతకీ ఏంటది?
సలార్‌లో థ్రోన్స్ వరల్డ్!
సలార్‌లో కీ రోల్ చేస్తున్నారు నటి శ్రియా రెడ్డి. ఇటీవల ఆమె ఈ సినిమా గురించి మాట్లాడుతూ ``సలార్ కోసం ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహా వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు`` అని అన్నారు. దీన్ని బట్టి సలార్‌లో డిఫరెంట్ వరల్డ్ ఉంటుందనే విషయం ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా స్పెషల్ యూనివర్శ్‌కి లీడ్ చేస్తుందనే టాపిక్ కూడా రెయిజ్ అయింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫాంటసీ డ్రామా డెలివిజన్. సలార్ కూడా అలాంటిదే అంటున్నారు తెలిసినవారు. కేజీయఫ్‌లో రాకీభాయ్‌కి ఎలా లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ క్రియేట్ చేశారో, సలార్‌లోనూ అలాంటిదే చేస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇంతకు ముందు బిల్లా, ఛత్రపతి, బాహుబలిలో సూపర్ డూపర్ మాస్ ఇమేజ్‌ని క్యారీ చేసిన డార్లింగ్, ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన మాస్‌ని పోట్రే చేస్తున్నారట. రెబల్లింగ్ ద వరల్డ్ అంటూ సలార్ రిలీజ్ డేట్‌ని ఈ మధ్య కూడా మళ్లీ ప్రకటించారు మేకర్స్.
లియోకి జీఓటీతో పోలికేంటి?
లియో ఫస్ట్ లుక్ పోస్టరకీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కీ లింక్ ఉందని అంటున్నారు జనాలు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ పోస్టర్‌కి చాలా దగ్గర పోలికలు లియో పోస్టర్‌తో ఉన్నాయన్నది నెటిజన్ల మాట. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్న మార్పులు, హీరో అవతార్‌లో చిన్న చిన్న కరెక్షన్లు మాత్రమే మారుతున్నాయన్నది అబ్జర్వర్స్ చెబుతున్న మాట.