English | Telugu

తంగ‌లాన్ హాట్ అప్‌డేట్‌!


విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న సినిమా తంగ‌లాన్‌. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. స్టూడియో గ్రీన్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. యాంబిషియ‌స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిస్తున్నారు. పెక్యులియ‌ర్ స‌బ్జెక్టుల‌ను ప‌ర్ఫెక్ట్ గా డీల్ చేస్తార‌నే పేరు తెచ్చుకున్న పా.రంజిత్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ని ఈవీపీ ఫిల్మ్ సిటీలో మేక‌ర్స్ పూర్తి చేశారు. ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ రెండు గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు. 30 ఏళ్ల యువ‌కుడిగా ఓ గెట‌ప్‌, వృద్ధుడిగా మ‌రో గెట‌ప్ ఉంటుంది. ఈ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ పోర్ష‌న్ కూడా ఉంటుంది. ఆ పోర్ష‌న్‌ని నెక్స్ట్ షెడ్యూల్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఫైన‌ల్ షెడ్యూల్‌ని మ‌దురై స‌మీపంలో తెర‌కెక్కించాల‌న్న‌ది ప్లాన్‌. అక్క‌డ వారం రోజుల పాటు చిత్రీక‌రణ ఉంటుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

రీసెంట్ షెడ్యూల్‌లో సినిమా కాస్ట్ అండ్ క్రూ అంద‌రూ క‌లిసి ఇంగ్లిష్ యాక్ట‌ర్ డేనియ‌ల్‌క‌ల్టిగ‌రోన్ పుట్టిన‌రోజును కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ప‌నిచేసిన వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థే తంగ‌లాన్‌. 2024లో తంగ‌లాన్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ప‌లు భాష‌ల్లో 2డీ, త్రీడీల్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. జీవీ ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్నారు. విక్ర‌మ్‌, ప‌శుప‌తి, పార్వ‌తి తిరువోతు, మాళ‌విక మోహ‌న‌న్‌, డేనియ‌ల్‌, హ‌రికృష్ణ‌న్ ఇత‌ర కీ రోల్స్ చేస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.