Read more!

English | Telugu

ప‌నిమనిషి కాళ్లు మొక్కుతాన‌న్న ర‌ష్మిక‌!

సౌత్ ఇండియాలోనే కాదు, ప్యాన్ ఇండియా లెవ‌ల్లో పాపుల‌ర్ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో త‌ప్ప‌క క‌నిపిస్తుంది ర‌ష్మిక పేరు. స్క్రీన్ మీద స్టైలిష్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది ర‌ష్మిక‌. సిన్సియ‌ర్ పెర్ఫార్మెర్‌గానూ నార్త్ లో పేరు తెచ్చుకుంది ఈ నేష‌న‌ల్ క్ర‌ష్‌. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక చెప్పిన మాట నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప్ర‌తిరోజూ ప‌నిమనిషి కాళ్లు మొక్కుతాన‌ని కొడ‌వ బ్యూటీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఫిదా అవుతున్నారు జ‌నాలు. త‌ను పాటించే సిద్ధాంతాలు, విలువ‌ల వ‌ల్ల‌నే ఇలాంటి ప‌నులు చేయ‌గ‌లుగుతున్నాన‌ని వివ‌రించింది ర‌ష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉంది ర‌ష్మిక‌. త‌న‌కున్న మంచి అల‌వాట్ల గురించి మాట్లాడుతూ ``నేను చాలా సెంటిమెంట్ ఉన్న అమ్మాయిని. చిన్న చిన్న విష‌యాల‌ను కూడా ప‌ట్టించుకుంటాను. అవి నాలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతుంటాయి. ఆత్మ‌సంతృప్తినిస్తుంటాయి. నేను నిద్ర లేవ‌గానే నా పెంపుడు జంతువుల‌తో స‌మ‌యం గ‌డుపుతాను.నా ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడుతాను.

ఇవ‌న్నీ నాలో ఉత్సాహాన్ని నింపే విష‌యాలు. మ‌నం మాట్లాడే మాట‌లు చాలా ప‌వ‌ర్‌ఫుల్. వాటికి మ‌నుషుల్ని క‌లిపే శ‌క్తి ఉంది. మ‌నుషుల్ని విడ‌దీసే శ‌క్తి ఉంది. అందుకే నాతో ఎవ‌రు ఎలా మాట్లాడుతున్నార‌నే విష‌యాన్ని బాగా ప‌ట్టించుకుంటాను. నేను ప్ర‌తి రోజూ డైరీ రాస్తాను. ఆ రోజు నాతో ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్తించార‌నే విష‌యాలు అందులో ఉంటాయి. నేను కూడా ఎవ‌రినీ బాధ‌పెట్టాల‌ని అనుకోను. ఆ మాట‌కొస్తే ఆచితూచీ మాట్లాడుతాను. ఎదుటివాళ్ల‌ను గౌర‌వించ‌డం నాకు తెలుసు. పెద్ద‌వాళ్లు ఎవ‌రైనా క‌నిపిస్తే వెంట‌నే కాళ్ల‌కు న‌మ‌స్కారం చేస్తాను. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు పెద్ద‌వాళ్ల కాళ్ల‌కు ద‌ణ్ణం పెడ‌తాను. మా ఇంట్లో ప‌నిమనిషి కాళ్లు కూడా రోజూ మొక్కుతాను. జ‌నాలను డ‌బ్బుప‌రంగానో, అంత‌స్తుల ప‌రంగానో వేరు చేయ‌డం నాకు ఇష్టం లేదు. నేను నేనుగా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాను. ఇవాళ సెల‌బ్రిటీ హోదా వ‌చ్చింద‌ని మారిపోవాల‌ని అనుకోను`` అని చెప్పింది ర‌ష్మిక‌. ఆమె న‌టించిన వార‌సుడు, మిష‌న్ మ‌జ్ను ఈ ఏడాది విడుద‌ల‌య్యాయి.