English | Telugu

నాన్నతో కజరారే పాటలో డ్యాన్స్ చేయాలనుంది - రామ్ చరణ్

"నాన్నతో కజరారే పాటలో డ్యాన్స్ చేయాలనుంది" అని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అన్నారట. వివరాల్లోకి వెళితే గతంలో హిందీలో వచ్చిన "బంటీ ఔర్ బబ్లీ" సినిమాలోని "కజరారే కజరారే" అనే పాట భారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ముగ్గురూ కలసి నటించిన ఈ పాట సెన్సేషనల్ హిట్టయ్యింది. ఇలాంటి పాటలో తన తండ్రితో పాటు డ్యాన్స్ చేయ్యాలనుందని రామ్ చరణ్ తన మనసులోని కోరికను తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

“i dreamt of doin a song like kajra re wit dad .i really envy abhishek bachan to hav acted wit his dad in soo many movies.” అది రామ్ చరణ్ మనసులోని ఆలోచన. ఇదేదీ పట్టించుకోకుండా మెగాస్టార్ తాను ఇక సినిమాల్లో నటించను అని స్టేట్ మెంటిచ్చారు. ఆ స్టేట్ మెంట్ చూసిన రామ్ చరణ్, అలాగే అశేషంగా ఉన్న మెగా ఫ్యాన్స్ నివ్వెరపోయారు. తండ్రితో వెండి తెర మీద డ్యాన్స్ చేయాలన్న రామ్ చరణ్ కోరిక నెరవేరేదెలా...? మరి ఇంతమంది మనోభావాలను ఆయన గుర్తించి మళ్ళీ నటిస్తే బావుణ్ణు కదూ...

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.