English | Telugu

పాట పాడుకున్న యన్ టి ఆర్, శృతిహాసన్

పాట పాడుకున్న యన్ టి ఆర్, శృతిహాసన్ అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్‍ హీరోయిన్ గా, హేట్రిక్ విజయంతో మంచి ఊపుమీదున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "చురకత్తి". ఈ సినిమాలోని ఒక పాటను ఇటీవల హీరో యన్ టి ఆర్, హీరోయిన్ శృతి హాసన్ లపై చిత్రీకరించారు.

ఇప్పటి వరకూ విలన్ రాహుల్ దేవ్ తో హీరో యన్ టి ఆర్ చేసే ఫైట్లనూ, యన్ టి ఆర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీల మధ్య జరిగే హాస్యరసభరిత సన్నివేశాలనూ చిత్రీరించారు. ఇప్పటికి మూడు స్కెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నాలుగవ స్కెడ్యూల్ ఆగస్టులో ఒక 15 రోజులపాటు జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ వరకూ నెలకు 15 రోజుల చొప్పున ఈ చిత్రం షుటింగ్ లో హీరో యన్ టి ఆర్ పాల్గొంటారని సమాచారం.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.