English | Telugu
ఇది రామ్ చరణ్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్
Updated : Nov 22, 2023
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాను చేసే సినిమాలని ఎంతగా ప్రేమిస్తాడో కార్ల ని కూడా అంతే ఇదిగా ప్రేమిస్తాడు. ఎన్నో కంపెనీలకి చెందిన అధునాతనమైన ఫ్యూచర్స్ తో కూడుకున్న కారులు చరణ్ దగ్గర ఉన్నాయి. చెర్రీ దగ్గర ఉన్న ఆ కారులతో చిన్న సైజు కారు కంపెనీ లాంటిది కూడా ఏర్పాటు చేసుకోవచ్చంటే అతిశయోక్తి కాదు. తాజాగా చరణ్ కి సంబంధించిన ఒక కారు అందులో ఉన్న చరణ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
రామ్ చరణ్ తాజాగా ఫెరారీ పోర్టోఫినో అనే మోడల్ కారులో వెళ్తు కెమెరాకి చిక్కాడు. రెడ్ కలర్ ఫెరారి లో రామ్ చరణ్ తన ఇంట్లోకి వెళ్తుంటే ఎవరో వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇక అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వారందరు కారు మోడల్ సూపర్ గా ఉందని అంటున్నారు. అంతటితో ఆగకుండా ఆ కారు ఖరీదు కూడా తెలుసుకొని ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆ కారు ఖరీదు అక్షరాలా 3 . 5 కోట్లు . ఆ ఫిగర్ చూసిన ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ మొదట షాక్ అయినా కూడా ఆ తర్వాత చరణ్ రేంజ్ అంటే అంతేగా మరి అని అనుకుంటున్నారు.
చరణ్ మరికొన్ని రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ రావడంలేదని అభిమానులు డల్ గా ఉన్నారు. అలాంటి టైం లో ఇప్పుడు చరణ్ ఫెరారీ వీడియోని చూసి ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో ఉన్నారు.