English | Telugu

'తండేల్'గా చైతన్య.. బర్త్ డే సర్ప్రైజ్ అదిరింది!

నాగ చైతన్య తన 23వ సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రేమమ్', 'సవ్యసాచి' తర్వాత చైతన్య, చందు కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.

గురువారం(నవంబర్ 23) చైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి సర్ ప్రైజ్ వచ్చింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ చిత్రానికి 'తండేల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు ఈ మూవీ నుంచి చైతన్య ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సముద్రంలో పడవ మీద తెడ్డు పట్టుకొని కూర్చొని ఉన్న చైతు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న 'తండేల్' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.