English | Telugu
రాజేంద్ర ప్రసాద్, అర్చన 'షష్టిపూర్తి' ప్రారంభం
Updated : Apr 2, 2023
రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'షష్టిపూర్తి'. ఈ చిత్ర పూజా కార్యక్రమం తాజాగా చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు షాట్ కి సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బి చౌదరి క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేశారు.
హీరోగా నటిస్తున్న రూపేష్ కుమార్ మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆ చిత్రాని నిర్మింస్తున్నారు. 'క్లాప్' చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఆకాంక్ష సింగ్, రూపేష్ కుమార్ కు జంటగా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన, 'కాంతారా' ఫేమ్ అచ్యుత్ కుమార్, వై విజయ, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నాలుగు పాటలున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. డీఓపీగా రామిరెడ్డి, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభమై మూడు షెడ్యూల్‌లతో తక్కువ వ్యవధిలో పూర్తి కానుంది. జులై 2023లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.