English | Telugu

మరో ప్రభంజనానికి సిద్ధమైన తలైవా.. 


సింహం ఒక అడుగు వెనక్కివేసింది అంటే వంద అడుగులు ముందుకు వెయ్యడానికి అనే సూత్రాన్ని తన జైలర్ మూవీ విజయం తో రజని మరోసారి భారతీయ చిత్ర పరిశ్రమకి గుర్తు చేసాడు. అలాగే జైలర్ మూవీ రిలీజ్ ముందు వరకు ఉన్న అన్ని రికార్డులని తుడిపేసి లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చాను అర్థమైందా రాజా అని తన పని అయిపోయిందని అనుకున్న వాళ్ళకి కూడా తన సత్తాని చూపించాడు .జైలర్ సక్సెస్ మోడ్ లో ఉన్న రజని తాజాగా ఒక కొత్త చిత్రాన్ని ప్రారంచించారు.ఆ మూవీ ఓపెనింగ్ కి సంబంచిన ఫొటోస్ రజని ఫాన్స్ ని ఆనందం లో ముంచడంతో పాటు సోషల్ మీడియాని ఒక ఊపు ఉపుతున్నాయి.

రజని..ఈ ఒక్క పేరు చాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ సినిమా కలక్షన్ ల వర్షం తో తడిసి ముద్దవటానికి . రజని దాదాపు రెండు దశాబ్దాలపై నుంచి తన సినిమాలతో సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా జైలర్ మూవీతో సక్సెస్ కొట్టి ఇప్పుడు తన 170 వ సినిమాగా టీజె జ్ఞానవేల్ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఆ మూవీ తాజాగా పూజ కార్యక్రమాలతో త్రివేండ్రంలో ప్రారంభం అయ్యింది. ఆ పూజ కార్యక్రమంలో రజని లుక్ ని చూసిన ఫాన్స్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. రజని ఇంకో ఇరవై ఏళ్ళు వెన్కక్కి వెళ్లాడని అంటున్నారు.
మూవీ లోని మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ఎన్నో సంవత్సరాల నుంచే రజని అంటేనే పాన్ ఇండియా హీరో ఇప్పుడు ఈ సినిమా లో కూడా పాన్ ఇండియా లెవెల్లో పేరెన్నికిగన్న నటులు నటిస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇటీవలే విక్రమ్,పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తం గా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్,అలాగే బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా కీర్తిని తెచ్చుకున్న దగ్గుబాటి రానాలు నటిస్తుండటం తో తలైవా 170 మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి.అందరి అంచనాలని అందుకునే విధంగానే ఈ చిత్ర కథ ఉండబోతుందని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ తలైవా 170 కి అనిరుద్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .