English | Telugu

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్న రాజమౌళి ట్వీట్!

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడిగా రాజమౌళిని అందరూ గౌరవిస్తారు. అంతేకాదు, తమ హీరోతో రాజమౌళి ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో హీరోల అభిమానులు కోరుకుంటారు. ఈ జనరేషన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తో సినిమాలు చేశారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతోనూ ఓ మూవీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం ఇంతవరకు చేయలేదు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల తర్వాత ఆయన నటనకు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ యాక్టింగ్ కెరీర్ ని కంటిన్యూ చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో పవన్-రాజమౌళి కాంబినేషన్ అనేది తెరపై చూడటం దాదాపు అసాధ్యమే.

అయితే పవన్ కళ్యాణ్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం. గతంలో పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పారు. అంతేకాదు, పవన్ తో సినిమా చేయడానికి అప్పట్లో ఆయన ప్రయత్నించారు. అలాంటి రాజమౌళి.. పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించారు. అది కూడా ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం రాజమౌళి చేసిన ఓ ట్వీట్ చూసి.. పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

2010లో రాజమౌళిని ఉద్దేశించి ఓ పవన్ అభిమాని సంచలన ట్వీట్ చేశాడు. "పవన్ మీతో మూవీ చేయడు. పవన్ మూవీస్, మీ మూవీస్ పూర్తి ఆపోజిట్. పవన్ మూవీస్ లో డబుల్ మీనింగ్స్, హీరోయిన్ ఎక్స్ పోజింగ్, వయలెన్స్ ఉండవు." అని అభిమాని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ కి వెంటనే రాజమౌళి కౌంటర్ ఇచ్చారు. "నువ్వు చెప్పింది నిజమే కావచ్చు బ్రదర్. ఇంతకీ నువ్వు బంగారం సినిమాలో సుబ్బులు సాంగ్ విన్నావా? అదేమైనా భక్తి గీతమా?" అంటూ రాజమౌళి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

15 ఏళ్ళ క్రితం నాటి ఈ ట్వీట్ ఉన్నట్టుండి ఇప్పుడు వైరల్ గా మారింది. యాంటి ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని రీట్వీట్ చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఆ ట్వీట్ లో తప్పేముందని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో మెజారిటీ కమర్షియల్ సినిమాల్లో ఆ ఎలిమెంట్స్ ఉండేవని.. అదే విషయాన్ని రాజమౌళి కాస్త వెటకారంగా చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అందులో తప్పేంలేదని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకే సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా పోస్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .