English | Telugu

రాజమౌళి హ్యాండా? మాజాకా?

ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా? కెరీర్ కు సంబంధించి రాంగ్ స్టెప్ వేశాడా? సినిమా అశేష ఆదరణ పొందినా ప్రభాస్ శ్రమంతా వృధాగానే మిగిలిపోనుందా? సినీ జనాలతో పాటూ ప్రభాస్ కూడా ఇలాగే ఫీలవుతున్నాడా? భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి తప్పనిసరిగా హిట్టవుతుందని నూటికి నూరు శాతంమంది విశ్వసిస్తున్నా....ఎందుకీ డైలమా? ఇదే విషయంపై ఆరాతీస్తే....సినిమాపై డౌట్ లేదు రాజమౌళిపై అంతకన్నా డౌట్ లేదు. కానీ జక్కన్న చేతిలో పడిన హీరోల గురించే డౌట్ అంటున్నారు.

భారీ బడ్జెట్ తో అంబరాన్నంటే అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న బాహుబలిపై ఎవ్వరికీ డౌట్ లేదు. కానీ అందరి కళ్లూ ప్రభాస్ పైనే ఉన్నాయి. ఎందుకంటే కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఛత్రపతిలో ఛాన్స్ ఇచ్చి సినీప్రియులతో ఛత్రం పట్టించాడు టాలీవుడ్ జక్కన్న. ఆ సినిమాలో ప్రభాస్ ను చూసి హీరో అంటే ఇలా ఉండాలనుకున్నారు. అప్పట్లోనే కాదు ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే అతుక్కుపోతారు. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ అంత మాయచేసింది మరి. కానీ ఆ తర్వాతే ప్రభాస్ ఎంత ఆచితూచి వ్యవహరించినా ఫ్లాపుల పరంపర నుంచి బయటకు రావడం చాలా కష్టమైంది. పౌర్ణమి మొదలు ఏక్ నిరంజన్ వరకూ అరడజను భయంకరమైన ఫ్లాపుల తర్వాత డార్లింగ్ గా వచ్చి మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనిపించుకుని మిర్చితో కెరీర్ ఘాటుపెంచాడు. ఇక దూకుడే అనుకుంటే మళ్లీ రాజమౌళి చేతిలో పడ్డాడు. దీంతో రెబల్ స్టార్ కష్టాలు కొనితెచ్చుకునేందుకు సిద్ధపడ్డాడంటున్నారంతా.



గతంలో జక్కన్న హీరోలను చూస్తే....స్టూడెంట్ నెం1 అనిపించిన యంగ్ టైగర్ ని సింహ్రాద్రితో ఫుల్ ఫామ్ లోకి తెచ్చేశాడు రాజమౌళి. కానీ సింహాద్రి తర్వాత వచ్చిన...ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ తో అరడజను వరుస ఫ్లాపులందుకున్నాడు. మళ్లీ యమదొంగతో మునుపటి క్రేజ్ ఇచ్చాడు జక్కన్న. ఆతర్వాత మళ్లీ పరిస్థితి మామూలే. వరుస ఫ్లాపులు లేకపోయినా.....అడపా దడపా మాత్రమే హిట్స్ వస్తున్నాయి. బావున్నాయి అనిపించుకున్న రెండుమూడు సినిమాలు కూడా కమర్షియల్ గా కాస్త నిరాశనే మిగుల్చాయి.

నితిన్ గురించి అస్సలు చెప్పక్కర్లేదు. ఎంచక్కా జయంతో హిట్టందుకున్నారు. ఇంతలో రాజమౌళితో సై అన్నాడు. అంతే దాదాపు పదేళ్ల పాటూ ఇండస్ట్రీలో నితిన్ అనే హీరో ఉన్నాడన్న మాటే జనాలు మర్చిపోయారు. అష్టకష్టాల తర్వాత మళ్లీ ఇష్క్, గుండెజారి గల్లంతైందేతో మళ్లీ జోరందుకున్నాడు. దీంతో ఇప్పట్లో రాజమౌళి వైపు తొంగిచూడకపోతేనే మంచిదనే సలహాలు ఇస్తున్నారు నితిన్ అభిమానులు.



మాస్ మహారాజ్ లో కొత్త కోణాన్ని విక్రమార్కుడితో వెలికితీశాడు జక్కన్న. రవి కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రంగా విక్రమార్కుడు నిలిచిపోతుంది. కానీ అప్పటి వరకూ స్పీడ్ మీదున్న బండి విక్రమార్కుడి తర్వాత మొరాయించింది. బ్రేక్స్ వేస్తూ ముందుకెళుతోంది. ఆ మధ్య బలుపు హిట్టవకపోతే రవితేజ పనైపోయిందనే ప్రచారమూ జరిగింది. అంతా రాజమౌళి హ్యాండ్ మహిమేగా అంటున్నారు.

చక్కగా కామెడీ పాత్రలు చేసుకుంటున్న సునిల్ తీసుకొచ్చి బ్రస్టుపట్టించిన ఘనత రాజమౌళిదే నేమో!. ఏడాదికి దాదాపు ఏడెనెమిది సినిమాల్లో మెరిసేవాడు. అందాలరాముడుతో హీరోగా మారినా మళ్లీ కమెడియన్ క్యారెక్టర్స్ చేసుకునేవాడు. కానీ రాజమౌళి పుణ్యమా అని మర్యాదరామన్న హిట్టవడంతో తానో పేద్ద హీరో అని ఫీలైపోయాడు. ఇంకేముంది వరుస ఫ్లాపులతో హీరోగా ముందుకెళ్లలేక, కమెడియన్ గా మారలేక నానా హైరానా పడుతున్నాడు. ఏ సినిమాలో నటిస్తున్నాడో? అవి ఎప్పుడు విడుదలవుతున్నాయో? జనాలకు తెలియడమే లేదు. హీరో మత్తు వదిలి మళ్లీ పాతరూట్లో వెళితే ఫలితం ఉంటుందేమో సునిల్ అని సలహా ఇస్తున్నారంతా.

మగధీరతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న రామ్ చరణ్ మిగిలిన వాళ్లలా వరుస ఫ్లాపులు అందుకోపోయినా.....వెనువెంటనే వచ్చిన ఆరెంజ్ ఫ్లాప్ అరడజను సినిమాల ఫ్లాప్ ను మించేంత బ్యాడ్ నేమ్ తెచ్చిందనే సంగతి తెలిసిందే.

రాజమౌళి బాధితుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరంటే నాని. పాత్రల ఎంపికలో, నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించే నాని అంటే సినీ ప్రియులు చాలామందికి మంచి అభిప్రాయం. కష్టపడతాడు, మెప్పిస్తాడు అనే భావనలో ఉంటారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన రాజమౌళి ఈగ నాని కెరీర్ని కష్టాల్లో నెట్టేసింది. ఈగ సినిమా తర్వాత ఇప్పటి వరకూ నాని కోలుకోలేదు. విసుగెత్తి తన సినిమా తానే తీసుకుంటా అనే స్థాయికి చేరిపోయాడు ఈ పిల్లజమిందార్. చక్కని నటుడిగా ప్రసంశలందుకున్న నాని మళ్లీ జోరందుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

గతంలో గోలంతా వదిలేస్తే.....బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ ని చూస్తుంటే జాలేస్తోందంటున్నారు. మిర్చి సూపర్ హిట్టవడంతో వెనువెంటనే ప్రాజెక్ట్స్ ఒప్పుకుని ఉంటే ఈపాటికి మూడు నాలుగు సినిమాలైనా విడుదలయ్యేవి. పోనీ రెండేళ్లు టైమ్ వేస్ట్ చేసుకున్నందుకు ఫలితం దక్కుతుందా అంటే.....బాహుబలి హిట్టైతే...ఆ క్రెడిట్ అంతా రాజమౌళి దే అంటారు. అసలు బాహుబలి రాజమౌళి సినిమా అంటారు కానీ ప్రభాస్ సినిమా మాత్రం అనరుగాక అనరు. అలాంటి సినిమా కోసం రెండేళ్లు టైమ్ వేస్ట్ చేసుకుని, ఒళ్లు హైరానా పెట్టుకుని, భారీగా పెరిగి, తగ్గి....కెరీర్లో టైమ్ వేస్ట్ చేసుకోవడంతో పాటూ భవిష్యత్ లో హెల్త్ ప్రాబ్లమ్ కొనితెచ్చుకునేలా ఉన్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.