English | Telugu

బాలయ్య లయన్ స్టొరీ ఇదేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా రూపొందిన‌చిత్రం ల‌య‌న్‌. మే1న ల‌య‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌చార చిత్రాలూ, పాట‌లూ సంద‌డి చేస్తున్నాయి. ల‌య‌న్‌లో బాల‌య్య పేల్చిన డైలాగుల గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. ఈలోగా... ల‌య‌న్ క‌థ లీకైపోయింది. ఈ సినిమాలో బాల‌య్య గత౦ గుర్తుకులేని వ్యక్తిలా క‌నిపిస్తార‌ని లేటెస్ట్ టాక్‌. బాల‌య్య‌కు యాక్సిడెంట్ అవుతుంద‌ట‌. హాస్ప‌ట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌... బాల‌య్య‌కు ఏం గుర్తుండ‌ద‌ట‌. త‌న ఊరు, పేరు, క‌నీసం భార్య కూడా గుర్తుకు రార‌ట‌. అవ‌న్నీ గుర్తు తెచ్చుకొంటూ.. త‌న ల‌క్ష్యం దిశ‌గా బాల‌కృష్ణ ఎలా సాగిపోయాడ‌న్న‌ది ల‌య‌న్ చిత్ర క‌థ‌ట‌. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఒక‌టి గత౦ గుర్తుకులేని వ్యక్తి అయితే... రెండోది సీబీఐ ఆఫీస‌ర్‌. వీరిద్ద‌రూ ఒక్క‌టేనా? లేదా వేర్వేరా అన్న‌ది స‌స్పెన్స్‌!!

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.