English | Telugu

హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబర్ హర్ష సాయి!

యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేదవారికి సాయం చేసే వీడియోల ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతనికి పలువురు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ హర్ష సాయి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

హర్ష సాయి ని హీరోగా లాంచ్ చేయడానికి మిత్ర శర్మ సన్నాహాలు చేస్తోంది. హర్ష సాయి ని భారీ స్థాయిలో లాంచ్ చేయడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుంగానే 'ఆదిపురుష్' కెమరామెన్ కార్తీక్ పలని తో 2 నిమిషాల నిడివి తో ప్రత్యేక టీజర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కేవలం టీజర్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. త్వరలోనే ఈ టీజర్ ను విడుదల చేయనున్నారట.

ఈ సినిమాని భారీస్థాయిలో నిర్మించనున్నారని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వనీయ సమాచారం. ఏది ఏమైనా హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ అనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.