English | Telugu

'పుష్ప-2' నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపికే. పుష్పగా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టెర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సన్సేషన్ కాంబోలో రాబోతున్న పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వేర్‌ ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు, ఐకాన్‌ స్టార్ లుక్‌కు వచ్చిన అనూహ్యమైన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ ఫాజిల్‌పై ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది.

ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్, ఫహద్ ఫాజిల్ సెట్‌లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. దీనికి "భన్వర్‌సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్‌ తాలూకు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు" అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలయికలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .