English | Telugu

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం "ప్రియుడు"

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం "ప్రియుడు" అని తెలిసింది.వివరాల్లోకి వెళితే యు.కె.అవెన్యూస్ పతాకంపై, యువ హీరో వరుణ్ సందేశ్ హీరోగా, ప్రణీతారావ్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, శ్రావణ్ దర్శకత్వంలో, పి.ఉదయ కిరణ్ నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రం "ప్రియుడు". ఈ "ప్రియుడు" ప్రణీతా రావ్ తమిళంలో ఆర్య హీరోగా నటించిన "చికుబుకు" చిత్రం ద్వారా సౌతిండియన్ సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించినా, తెలుగులో హీరోయిన్ గా నటించటం "ప్రియుడు" చిత్రంతోనే మొదలు పెట్టింది.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ "అతిథి" ఫేం అమృతా రావ్ చెల్లెలే ఈ ప్రణీతా రావ్ కావటం విశేషం. అన్నట్టి ఈ రోజు అంటే జూలై 21 వ తేదీకి ఒక విశేషం ఉంది. అదేంటంటే ఈ రోజే ఈ చిత్ర హీరో వరుణ్ సందేశ్ జన్మదినం. హీరో వరుణ్ సందేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తను నటించే సినిమాల్లో తెలుగుని అమెరికన్ యాశతో కాకుండా తెలుగుని తెలుగులాగానే మాట్లాడాలని కోరుతూంది తెలుగువన్ డాట్ కామ్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.