English | Telugu
పవన్ పుణ్యానైనా ఆమె కోరిక నెరవేరుతుందా?
Updated : Feb 23, 2023
వింక్ బ్యూటీ కి అదృష్టం తలుపు తట్టింది. ఎంత క్రేజ్ ఉన్నా కొన్నిసార్లు కొంతమందికి కమర్షియల్ గా సక్సెస్ లు రావు. క్రేజీ ఆఫర్లు రావడం జరగదు. అదృష్టం తలుపు తట్టదు. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు కూడా సక్సెస్ కాక పోవడంతో వారికి క్రేజ్ సొంతం కాకుండా పోతుంది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళం లో ఓరు ఆధార్ లవ్ మూవీ తో తెరంగేట్రం చేసింది. ఓ సీన్‌లో హీరోకి కన్నుకొడుతూ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. తేజసజ్జతో ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ లో నటించింది. అదృష్టం అవకాశాల రూపంలో తలుపు తట్టిన సక్సెస్ మాత్రం ఆమెకి దక్కలేదు. ఈ రెండు చిత్రాలు ఆమెకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఈ రెండు చిత్రాలు చేదు అనుభవాన్ని మిగల్చడంతో హిందీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. హిందీలో త్రీ మంకీస్. యారియా 2, లవ్ హాకర్స్, శ్రీదేవి బంగ్లా వంటి సినిమాల్లో నటిస్తోంది. అయినా ఆమె మైండ్ మొత్తం తెలుగు సినిమాల వైపే తిరుగుతోంది. టాలీవుడ్ లో నటించాలని ఇక్కడే పేరు తెచ్చుకోవాలని బలంగా కోరుకుంటుంది. పవర్ స్టార్ రూపంలో ప్రియ ప్రకాష్ వారియర్ కు బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న వినోదాయ సిత్తం రీమేక్ లో అవకాశం వచ్చిందట. సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ప్రియా ప్రకాష్ వారియర్ దశతిరిగినట్టే.