English | Telugu

వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ మూవీ!

హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీలు తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న హను.. ప్రభాస్ తో చేయబోయేది మాత్రం లవ్ స్టోరీ కాదని కూడా టాక్ వినిపించింది. అంతేకాదు ఇది వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమని తాజాగా న్యూస్ వినిపిస్తోంది.

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. స్టార్ దర్శకులతో కంటే కూడా యంగ్, మీడియం రేంజ్ దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆయన దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'అందాల రాక్షసి'తో దర్శకుడిగా పరిచయమైన హను.. ప్రేమ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గతేడాది విడుదలైన 'సీతా రామం' క్లాసిక్ హిట్ గా నిలిచి, ఆయనకు మరింత పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనుందట.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. జూన్ 16న 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 'సలార్', 'ప్రాజెక్ట్ కె'తో పాటు మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాన్ని ప్రకటించాడు. 'స్పిరిట్'తో పాటు, హను రాఘవపూడి ప్రాజెక్ట్ పారలల్ గా షూటింగ్ జరుపుకోనుందని వినికిడి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.