English | Telugu

హైదరాబాద్ లో 100 అడుగుల ప్రభాస్ కటౌట్

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు ఇండియన్ హీరో. సినిమా పరి భాష లో చెప్పాలంటే పాన్ ఇండియా హీరో. ప్రభాస్ నుంచి వస్తున్న తాజా మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న సలార్ మూవీ మీద ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గత నెలలోనే విడుదల కావలసిన సలార్ మూవీ సి .జి వర్క్ కారణంగా వాయిదా పడి డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వబోతుంది .ఈ మేరకు సలార్ మేకర్స్ అధికారకంగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కానీ అప్పుడే సలార్ మూవీ హంగామా మొదలయ్యింది. ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనది. ఆయన నటన కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. లవర్ తో ప్రేమగా మాట్లాడాలన్నా, కుటుంబ విలువలని ఎంతో ఓర్పుతో చెప్పాలన్నా,శత్రువు బెదిరిపోయేలా వార్నింగ్ ఇవ్వాలన్నా అది ప్రభాస్ కే సాధ్యం. సినిమా మొత్తాన్ని తన భుజ స్కందాలపై మోసి ఆ సినిమాని హిట్ చెయ్యగలిగే కెపాసిటీ ప్రభాస్ సొంతం.
ప్రభాస్ ఫాన్స్ మొత్తం ఎప్పుడెప్పుడు డిసెంబర్ 22 వస్తుందా అని కళ్ళల్లో వత్తులేసుకొని మరి ఎదురు చుస్తునారు. కానీ కొంత మంది అభిమానులు మాత్రం అప్పుడే సలార్ హడావిడిని స్టార్ట్ చేసారు.

ఈ నెల 23 న ప్రభాస్ పుట్టిన రోజు. ప్రభాస్ అభిమానులకి మాత్రం పండగ రోజు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రభాస్ అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చెయ్యడం,ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేదలకి ఉచితంగా మందులు పంచడం,అలాగే అన్నదానాలు చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ఐ మాక్స్ థియేటర్ దగ్గర 100 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులకి తెలియడంతో ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో మరింత హడావిడి కనపడనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .