English | Telugu
పవన్ హీరోగా పూరీ చిత్రం
Updated : Jan 19, 2012
పవన్ హీరోగా పూరీ చిత్రం రాబోతూందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం" బద్రి". ఈ "బద్రి" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అమీషా పటేల్, రేణూ దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. ఇది సూపర్ హిట్టయ్యింది. ఇది 1999 నాటి సంగతి. అప్పటి నుండీ మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఇంతవరకూ రాలేదు. ప్రస్తుతం డి.వి.వి.దానయ్య మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విషయంపై హీరో పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ "గబ్బర్ సింగ్" సెట్స్ కి వెళ్ళారు. పూరీ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చిందట. "గబ్బర్ సింగ్" పూర్తికాగానే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా ప్రారంభమవుతుంది.