English | Telugu

నటి సనాఖాన్ దుర్మరణం

పాకిస్తాన్ నటి సనా ఖాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పాకిస్తాన్ లోని హైదరాబాదుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. సనాఖాన్ భర్త బాబర్ కారు నడుపుతున్న సమయంలో, కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కాసేపటికే సనా మృతి చెందింది. తీవ్ర గాయాలతో ప్రమాద పరిస్థితిలో ఉన్న బాబర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సనా పలు షోల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.