English | Telugu

ఈ దీపావళికి 25  సినిమాలు

ఈ దీపావళి సినిమా ప్రేక్షకులకి మరింత వెలుగులుని తీసుకురాబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు థియేటర్లతో పాటు ఓటిటి లో విడుదల కాబోతున్నాయి. దీంతో తెలుగు సినిమా ప్రేక్షకుల ఇళ్లల్లో ఇప్పటి నుంచే సినిమా సందడి మొదలయ్యింది. సందడి చేసే సినిమాల లిస్ట్ చూద్దాం.

థియేటర్లలో

నవంబర్ 10 : జపాన్, జిగర్తాండ, అలా నిన్ను చేరి, ది మార్వెల్స్
నవంబర్ 11 : దీపావళి
నవంబర్12 : టైగర్ 3
ఇలా ఐదు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాల వివరాలు చూద్దాం.
అమెజాన్‌ ప్రైమ్‌
నవంబరు 7 : రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌)
నవంబరు 9 : బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ)
నవంబరు 10 :పిప్పా (హిందీ)
నెట్‌ఫ్లిక్స్‌
నవంబరు 6 :ఇరుగుపట్రు (తమిళ చిత్రం), రిక్ అండ్ మార్టీ సీజన్ 7 (హాలీవుడ్ )
నవంబరు 8 :ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) సైబర్ బంకర్ :ది క్రిమినల్ అండర్ వరల్డ్
నవంబరు 10 :ది కిల్లర్‌ (హాలీవుడ్‌)
ఆహా
నవంబరు 10 :ది రోడ్‌ (తమిళం)
డిస్నీ+హాట్‌స్టార్‌ :
నవంబరు 8 : ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) విజిలాంటి (కొరియన్‌)
నవంబరు 10 :లేబుల్‌ (తెలుగు)
జీ 5
నవంబరు 10 :ఘూమర్‌ (హిందీ) వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
బుక్‌ మై షో
నవంబరు 7 : ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌) యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌)
నవంబరు 10 : ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌)
ఇలా సుమారు 25 సినిమాలతో ఈ దీపావళి సినిమా అభిమానులకి మరింత వెలుగుల్ని తీసుకురాబోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.