English | Telugu

ఈనెల 27న ఊహలు గుసగుసలాడే ఆడియో

"అష్టా చెమ్మా" చిత్రంతో నటుడిగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఊహలు గుసగుసలాడే". "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాగ శౌర్య, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 27న జరగనుంది. ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర దశలో ఉంది. కళ్యాణి కోడూరి సంగీతం అందించిన పాటలు వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.