English | Telugu

ఒక పాటకు 5కోట్లు ఖర్చు

దర్శకుడు శంకర్ ఏం చేసిన చాలా భారీగా చేస్తుంటాడు. ఆయన సినిమాలో బడ్జెట్ చాలా ఎక్కువగా ఖర్చుపెడతాడు. కానీ అంతే రేంజులో వసూళ్ళు కూడా వస్తాయి. మాములుగా రజనికాంత్ తో శంకర్ తీసే సినిమాలకు భారీ బడ్జెట్ ఉందంటే ఎవరు ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ తమిళంలో తన మార్కెట్ రేటు తగ్గిపోతున్న విక్రమ్ తో శంకర్ భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నాడు.

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా "ఐ" అనే చిత్రం తెరకెక్కుతుంది. తెలుగులో "మనోహరుడు". ఈ చిత్రంలోని ఓ పాట కోసం అయిదు కోట్లు ఖర్చు చేస్తున్నాడు శంకర్. ఈ పాట సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్ర యూనిట్. గతంలో శంకర్ తీసిన "శివాజీ", "రోబో" వంటి చిత్రాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అదే స్టైల్ లో ఈ సినిమా రేంజును కూడా పెంచేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఎమి జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.