English | Telugu
అప్పుడే 40 అంటే నమ్మకంగా లేదు నయనతార
Updated : Nov 18, 2023
దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఉన్న టాప్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. అందానికి అందం,అభినయనానికి అభినయం ఆమె సొంతం. సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల సినీ కెరీర్ తక్కువ అనే ఒక నిజాన్ని అబద్దంగా మార్చింది నయనతారనే. ఈ రోజు తన సినిమా కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలని ఎదుర్కొని లేడీ సూపర్ స్టార్ గా అవతరించిన నయనతార పుట్టిన రోజు. 39 సంవత్సరాలని పూర్తిచేసుకొని 40 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
2003 లో వచ్చిన మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో నయనతార సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలో గౌరీ అనే పాత్రలో చక్కగా నటించి మొదటి సినిమాతోనే ఎంతో భవిష్యత్త్తు ఉన్న హీరోయిన్ అని అనిపించుకుంది.ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి చేసిన చంద్రముఖి చిత్రం నయనతార గురించి అన్ని బాషల ప్రజలకి తెలిసేలా చేసింది. ఆ సినిమాలోని నయన తార అందానికి నటనకి మైమర్చిపోని ప్రేక్షకుడు లేడు. ఆ తర్వాత వచ్చిన గజినీ, విక్టరీ వెంకటేష్ తో చేసిన లక్ష్మి ,విజయ్ తో చేసిన శివకాశి,అజిత్ బిల్లా, ఎన్టీఆర్ అదుర్స్ లాంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపుని ఇచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె చేసిన చాలా చిత్రాలు పరాజయం చెందాయి.దాంతో చాలామంది ఇక అందరి హీరోయిన్ లు లాగానే నయనతర కూడా ఇక ఇంటికి వెళ్లడమే అని అనుకున్నారు.
కానీ బాలకృష్ణ తో చేసిన సింహ సినిమాతో నయనతార ప్రభంజనం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డం ని నయన్ సంపాదించుకుంది. బాపు గారు అంతటి వ్యక్తి శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నయనతర కాకుండా ఇంక ఎవరు చేసిన సూట్ అవ్వరు అన్నారంటే నయన్ నటనకి ఉన్న వాల్యూ ని అర్ధం చేసుకోవచ్చు. రాజా రాణి, ఆరంభం, కృష్ణం వందే జగద్గురుం,తన్ని ఒరువన్, మాయ,తిరునాల్, బాబు బంగారం,డోరా,విశ్వాసం ,జై సింహ, సైరా నరసింహారెడ్డి, బిగిల్ ,దర్బార్ ,గాడ్ ఫాదర్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. తాజాగా పాన్ ఇండియా లెవల్లో షారుక్ తో జవాన్ మూవీ చేసి తన సత్తాని చాటింది .త్వరలో అన్నపూర్ణి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అసలు ఒక బాషలోనే నటించడానికి హీరోయిన్ లకి అవకాశాలు దొరకని సినిమా ఇండస్ట్రీ లో నయన్ 20 సంవత్సరాల నుంచి తన హవా ని కొనసాగిస్తుందంటే నిజంగా గ్రేట్. నయనతర భర్త ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్. ఇరువురికి ఇద్దరు మగ పిల్లలు.