English | Telugu

పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చింది కేటీఆర్ ని కాపాడటం కోసమే

ప్రకాష్ రాజ్(prakash raj)గత కొన్నిరోజుల నుంచి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరకి తెలిసిందే. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఒక రాజకీయ మీటింగ్ లో తీవ్ర ఆరోపణలు కూడా చేసాడు. పవన్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నా అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ మీద తిట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. సినిమా పరిశ్రమకి చెందిన కొంత మంది అయితే ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చెయ్యాలని కూడా అంటున్నారు.

రీసెంట్ గా ప్రకాష్ రాజ్ పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్(natti kumar)కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మీడియా మొత్తం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, కొండా సురేఖ మధ్య నడుస్తున్న ఇష్యూ మీద ఫోకస్ చేసింది.ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.దాంతో ప్రకాష్ రాజ్ ఆ ఇష్యు ని డైవర్ట్ చెయ్యడం కోసమే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాడు. గత వైసిపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏనాడూ ఎలాంటి సమస్య మీద ప్రకాష్ రాజ్ స్పందించలేదు.

వైసిపీ ప్రభుత్వం సినిమా టికెట్ ని ఐదు రూపాయలు చేసినపుడు, చిరంజీవిని అవమానించినప్పుడు మాట్లాడలేదు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు ఏ రోజైనా ఇండస్ట్రీ గురించి గాని ప్రజల బాగోగుల గురించి కానీ ఆలోచించని నువ్వు ఇప్పుడు పవన్ ని విమర్శించడం చాలా విడ్డురంగా ఉంది. కనీసం ఎవరకి తిండి కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.