English | Telugu
పరాశక్తి తెలుగు రిలీజ్! ఆ సినిమా ప్లాప్ అవ్వడం కొంప ముంచిందా!
Updated : Jan 14, 2026
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-తమిళ కలెక్షన్స్ ఎంత
- తెలుగు రిలీజ్ ఉంటుందా
-ఫలితం ఎలా ఉండబోతుంది!
తెలుగునాట 'శివ కార్తికేయన్'(Sivakarthikeyan)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రీవియస్ మూవీ మదరాసి తో పెద్దగా విజయాన్ని అందుకోకపోయినా 'అమరన్' తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. దీంతో సుధా కొంగర(Sudha Kongara)దర్శకత్వంలో ప్రస్తుతం చేసిన పరాశక్తి(Parasakthi)కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరాశక్తి తెలుగు రిలీజ్ కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ వైరల్ గా మారింది. సదరు న్యూస్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
పరాశక్తి ఈ నెల 10 న తమిళంతో పాటు తెలుగు నాట విడుదల కావడానికి ముస్తాబయింది. కానీ తెలుగునాట తెలుగు చిత్రాలు ఎక్కువగా రిలీజ్ ఉండటంతో తెలుగు రిలీజ్ వాయిదా పడి తమిళ నాట మాత్రమే రిలీజయ్యింది. దీంతో తెలుగు రిలీజ్ డేట్ కోసం అభిమానులు,మూవీ లవర్స్ ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం పరాశక్తి తమిళనాట ప్లాప్ టాక్ తో రన్ అవుతుంది. రివ్యూ లు కూడా పరాజయాన్ని ఫిక్స్ చేసాయి. ఈ నేపథ్యంలో తెలుగు థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చని, డైరెక్ట్ గా ఓటిటి ద్వారా రిలీజ్ కావచ్చని అంటున్నారు.అభిమానులు మాత్రం తెలుగుకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయ్యి ఉంటుంది కాబట్టి రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా మేకర్స్ రిలీజ్ విషయంపై అధికారకంగా ప్రకటిస్తేనే అసలు విషయం తెలుస్తుంది.
also read:రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే
1965 వ సంవత్సరం మధ్య జరిగే పొలిటికల్ డ్రామాగా పరాశక్తి తెరకెక్కగా చెజియాన్ అనే క్యారక్టర్ లో శివ కార్తికేయన్ నటన అత్యద్భుతంగా ఉంటుంది. తిరు అనే మరో క్యారక్టర్ లో జయం రవి కనిపించడం అభిమానులకి ప్రత్యేక కానుక. రత్నమాల గా శ్రీలీల(Sreeleela)కూడా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా చేసింది. సుమారు 170 కోట్ల తో తెరకెక్కగా ఇప్పటి వరకు 15 కోట్లు మాత్రమే రాబట్టినట్టుగా సినీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.