English | Telugu

బాలయ్య మనసు బంగారం.. అసిస్టెంట్ డైరెక్టర్ కి 40 లక్షలు విలువైన వైద్యం!

కష్టంలో ఉన్న వారికి సాయం చేయడంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందు ఉంటారు. ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై, వైద్యం చేయించుకునే స్థోమత లేదని తెలిస్తే చాలు.. వెంటనే తన వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తారు బాలయ్య. తాజాగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కి రూ.40 లక్షల విలువైన వైద్యం చేయించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర మహేష్ యాదవ్ అనే వ్యక్తి దర్శకత్వ శాఖలో పని చేస్తున్నాడట. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వినయ విధేయ రామ, అఖండ వంటి సినిమాలకు పని చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడని, చికిత్స కోసం సుమారుగా 40 లక్షలు ఖర్చు అవుతుందని బోయపాటి ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ.. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ లో చేర్పించి ఉచితంగా వైద్యం చేపించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో మా బాలయ్య బంగారం అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.