English | Telugu

1300 కోట్ల రూపాయిల సినిమాని వదులుకున్న నాగార్జున!.. డీటెయిల్స్ ఇవే 

-సోషల్ మీడియా వేదికగా నాగార్జున అభిమానుల హంగామా
-నాగార్జున వదులుకోవడానికి కారణమేంటి!
-ఇంతకీ ఆ చిత్రం ఏంటి
-100 వ చిత్రం ఎంత వరకు వచ్చింది


రెండున్నర దశాబ్దాల క్రితమే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా భారతీయ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాడు కింగ్ 'నాగార్జున'(Nagarjuna). ఆ మాటకొస్తే తెలుగు సినిమాకి పాన్ ఇండియా సొగసుల్ని అద్దిన తొలి తెలుగు హీరో కూడా నాగార్జునే. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా, నాగార్జున సినీ కెరీర్ ని క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. తాను సృష్టించిన పాన్ ఇండియా హవానే కొనసాగిస్తు కథకి సంబంధించి కీలకమైన పాత్రలు వస్తే హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త పంధాని సృష్టించడానికి కూడా వెనకాడటం లేదు. కూలీ. కుబేర వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇదే తరహాలో నాగార్జున ఒక భారీ సినిమాలో ఆఫర్ ని వదులుకున్నాడనే న్యూస్ రీసెంట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ధురంధర్(Dhurandhar).. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఇప్పటికే 1300 కోట్ల రూపాయలని రాబట్టిన ధురంధర్ ముందు విజయం అనేది చిన్న పదం. అంతలా ధురంధర్ భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా ఎంటైర్ ప్రపంచ సినీ ప్రేమికులని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ ధురంధర్ కి వెన్నుదన్నుగా నిలిచాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిట్. పాకిస్థాన్ దేశానికి చెందిన నిజమైన రౌడీ షీటర్ రెహ్మాన్ క్యారక్టర్ లో అక్షయ్ ఖన్నా నటించిన విధానం ఒక రేంజ్ లో ఉంటుంది.

దర్శకుడు ఆదిత్య దర్(Adithya Dhar)ఈ క్యారక్టర్ కి మొదట నాగార్జున ని అనుకున్నాడనే వార్తలే ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. నాగార్జున అని అనుకోవడమే కాదు, కథ కూడా వినిపించారని, రెహ్మాన్ క్యారెక్టర్ నాగార్జున కి బాగా నచ్చిందనే న్యూస్ కూడా వినపడుతుంది. కానీ అదే సమయంలో రజనీకాంత్ తో కలిసి చేస్తున్న‘కూలీ’, ధనుష్ తో చేస్తున్న ‘కుబేర’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయంట. దీంతో 'ధురంధర్’కి డేట్స్‌ని అడ్జస్ట్ చేయడం కుదరక రెహ్మాన్ క్యారక్టర్ ని నాగార్జున వదులుకోవాల్సి వచ్చిందనే వార్తలు ఒక రేంజ్ లోనే వైరల్ అవుతున్నాయి. కూలీ, కుబేర లు మాత్రం పారలల్ గా షూటింగ్ ని జరుపుకున్నాయి.

ఇక నాగార్జున అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు కళకి సంబంధించి ఎన్ని రకాల వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ ఉంటాయో, వాటన్నిటిలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం నాగార్జున నటనకి ఉన్న స్టైల్. డేట్స్ వర్క్ అవుట్ అయ్యి ధురంధర్ లో రెహ్మాన్ గా నాగార్జున కనిపించి ఉంటే భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం నమోదయ్యేదని, నాగార్జున కెరీర్ లో కూడా సదరు క్యారక్టర్ చిరస్థాయిగా నిలిచిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున ప్రస్తుతం తన 100 వ చిత్రంకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. సదరు చిత్రాన్నినాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సరికొత్త కథ, కథనాల్ని పరిచయం చెయ్యబోతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన రా. కార్తీక్(Raa Karthik)దర్శకుడు కాగా, నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడు. త్వరలోనే అధికారకంగా ప్రారంభం కానుంది.