English | Telugu

రామారావు కథతో నాగచైతన్య కొత్త సినిమా!

అక్కినేని నాగచైతన్య హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. బంగార్రాజు సక్సెస్ తర్వాత ఈ అక్కినేని వారసుడు మూడు సినిమాలు చేస్తే మూడు ఫ్లాఫ్ అయ్యాయి. దీంతో నెక్ట్స్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో చేతులు కలిపారు చైతన్య. కార్తికేయ 2తో పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్న చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు లొకేషన్స్ సెర్చింగ్‌లో ఉన్న ఈ టీమ్ ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయకుండా మేకర్స్ సీక్రెసీ పాటించారు.

అయితే నెట్టింట మాత్రం నాగ చైతన్యతో మరోసారి సాయి పల్లవి నటించనుందని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది వరకు వచ్చిన లవ్ స్టోరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మరో వైవిధ్యమైన చిత్రంతో మెప్పించటానికి వీరు సిద్ధమవుతున్నారు. 2018లో గుజరాత్ నుంచి 21 మంది కోస్ట్ గార్డ్స్ చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. దాంతో వారిని అక్కడి కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేశారు. అందులో ఒకడైన రామారావు అనే వ్యక్తి తాలుకు కథతో సినిమా ఉంటుంది. వారి పాక్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ఓ వైపు లవ్, మరో వైపు ఎమోషల్ అంశాల మేళవింపుగా దీన్ని చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌తో సినిమా సాగుతుంది. చైతన్య ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో మెప్పించబోతున్నారు. దీనికి తండేలు అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.