English | Telugu
నాగచైతన్య హీరోగా వీరూ పోట్ల చిత్రం
Updated : Feb 4, 2012
నాగచైతన్య హీరోగా వీరూ పోట్ల చిత్రం రానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ సినీ రచయిత, దర్శకులు అయిన వీరూ పోట్ల దర్శకత్వంలో, కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద రెడ్డి ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరూ పోట్ల గతంలో మంచు మనోజ్ కుమార్ హీరోగా "బిందాస్", కింగ్ నాగార్జున హీరోగా "రగడ" చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నాగచైతన్య ప్రస్తుతం "ఆటోనగర్ సూర్య", గౌరవం చిత్రాల్లో నటించటానికి అంగీకరించారు. ఈ రెండు చిత్రాల తర్వాత వీరూ పోట్ల దర్శకత్వం వహించే చిత్రం ఉంటుందని తెలిసింది. అలాగే "అహ నా పెళ్ళంట, పూలరంగడు" చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కూడా ఒక చిత్రం ఉండే అవకాశం ఉందని సమాచారం.