English | Telugu
"భట్టివిక్రమార్క" రీమేక్ చేయటం లేదు - సాయిబాబా
Updated : Feb 4, 2012
"భట్టివిక్రమార్క" రీమేక్ చేయటం లేదు అని సాయిబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రుడిగా, నయనతార సీతాదేవిగా, బాపు గారి దర్శకత్వంలో "శ్రీరామరాజ్యం" అనే భక్తిరస చిత్రాన్ని నిర్మించిన చక్కని అభిరుచి ఉన్న నిర్మాత యలమంచిలి సాయిబాబా. ఈ నిర్మాత సాయిబాబు గతంలో నటరత్న యన్.టి.ఆర్., కాంతారావు, అంజలీ దేవి యస్.వి.రంగారావు, రేలంగి, నాగభూషణం తదితరులు నటించగా బ్లాక్ బస్టర్ హిట్టయిన "భట్టివిక్రమార్క" చిత్రాన్ని యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రీమేక్ చేయనున్నారనే వార్త ఈ మధ్య సినీ వర్గాల్లో బాగా ప్రాచుర్యం పోందింది. అయితే అది నిజం కాదనీ తాను "భట్టివిక్రమార్క" చిత్రాన్ని రీమేక్ చేయటం లేదనీ సాయిబాబా మీడియాకు తెలియజేశారు.