English | Telugu
చాలా రోజులకు నోరు విప్పబోతున్న ఎన్టీఆర్!
Updated : Dec 7, 2023
ఆన్ స్క్రీన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటనకే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో ఆయన స్పీచ్ లకి కూడా ఎందరో అభిమానులున్నారు. ఆయన స్పీచ్ కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉంటారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్, సినిమా వేదికలపై సందడి చేయడం బాగా తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణం గత ఆరేళ్లలో ఆయన నటించిన సినిమాలు రెండే విడుదలయ్యాయి. ఎప్పుడో 2018 లో 'అరవింద సమేత'తో అలరించిన ఎన్టీఆర్, 2022లో 'ఆర్ఆర్ఆర్'తో పలకరించాడు. దీంతో ప్రీ రిలీజ్ వేడుకల్లో తారక్ స్పీచ్ లను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు.
ఇతర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అడపాదడపా సందడి చేస్తుంటాడు ఎన్టీఆర్. ఈ ఏడాది 'అమిగోస్', 'మాస్ కా దాస్' వంటి సినిమా వేడుకల్లో పాల్గొని తన స్పీచ్ లతో అదరగొట్టాడు. త్వరలోనే తారక్ మైక్ పట్టి తన వాక్చాతుర్యంతో అభిమానులను మరోసారి అలరించే అవకాశముంది. తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు ఎన్టీఆర్ హాజరు కావడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్' డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 26 లేదా 27 తేదీల్లో నిర్వహించే అవకాశముంది. ఆ వేడుకకు ఎన్టీఆర్ హాజరవుతాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వస్తున్న ఎన్టీఆర్.. ఏం మాట్లాడతాడో చూడాలి.