English | Telugu

ఎన్టీఆర్ తప్పించుకున్నాడు.. ఆ ఇద్దరు బుక్కయ్యారు!

సినీ పరిశ్రమలో రచయితగానూ, దర్శకుడిగానూ రాణించినవారు ఉన్నారు. అదే విధంగా రచయితగా విజయాలను అందుకొని, దర్శకుడిగా మాత్రం విజయం సాధించలేక నిరాశపరిచిన వారు కూడా ఉన్నారు. అదే కోవలోకి రచయిత నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ వస్తాడు.

'కిక్', 'ఎవడు', 'రేసుగుర్రం', 'టెంపర్' వంటి హిట్ సినిమాలకు కథలు అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ.. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. ఎన్టీఆర్ తో వంశీకి మంచి అనుబంధముంది. తారక్ నటించిన అశోక్, ఊసరవెల్లి, టెంపర్ వంటి సినిమాలకు వక్కంతం రైటర్ గా పని చేశాడు. ఆ అనుబంధంతోనే డైరెక్టర్ గా తన మొదటి సినిమాని ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు వంశీ. ఎన్టీఆర్ కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ వక్కంతం చెప్పిన కథతో పూర్తిగా సంతృప్తి చెందని తారక్.. కొన్ని మార్పులు సూచించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వంశీ వెళ్ళి బన్నీకి కథ చెప్పడం, 'నా పేరు సూర్య' అనే చిత్రం పట్టాలెక్కడం జరిగిపోయాయి. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

'నా పేరు సూర్య' ఫలితంతో వంశీకి దర్శకుడిగా రెండో సినిమా అవకాశం రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు నితిన్ తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని, ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. దీంతో కథ విషయంలో సంతృప్తి చెందక ఎన్టీఆర్ తప్పించుకుంటే.. బన్నీ, నితిన్ మాత్రం చెరో ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .