English | Telugu
వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ కామెంట్స్
Updated : Dec 7, 2023
సీతారామంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాందించిన నటి మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాచురల్ స్టార్ నాని హీరోగాఈ రోజు విడుదలైన ఈ సినిమాకి బాగుందనే టాక్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాళి నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మృణాళి తన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ తన ట్విటర్ ద్వారా హాయ్ నాన్న మూవీ గురించి ప్రస్తావిస్తు ఈ రోజు హాయ్ నాన్న సినిమా విడుదల అవుతుంది. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను హాయ్ నాన్న మూవీ నాకు ఎంతగానో ప్రత్యేకమైనది ఈ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాను అని మృణాల్ చెప్పుకొచ్చింది. అలాగే హాయ్ నాన్న లో తనతో పాటు నటించిన వాళ్ళతో కలిసి దిగిన పిక్స్ ని కూడా మృణాల్ షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మృణాల్ సీతారామం మూవీలో పోషించిన సీత క్యారక్టర్లో ఎంతలా విజృభించి నటించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు విడుదలైన హాయ్ నాన్న మూవీలో కూడా యష్ణ క్యారక్టర్ లో అంత కంటే ఎక్కువుగా విజృంభించి నటించిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. రెండు షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో అవలీలగా నటించిన మృణాల్ రాబోయే రోజుల్లో తెలుగు సినిమా అగ్రకథానాయికిగా మారడం ఖాయమని కూడా అంటున్నారు.