English | Telugu
'మిల్కీ బ్యూటీ' పాట వచ్చేసింది.. బాస్ గ్రేస్ అస్సలు తగ్గట్లేదుగా!!
Updated : Jul 21, 2023
"భోళా మానియా" రూపంలో ఇంట్రోసాంగ్ ని.. "జామ్ జామ్ జజ్జనక" రూపంలో సెలబ్రేషన్ సాంగ్ ని రిలీజ్ చేసిన 'భోళా శంకర్' టీమ్.. తాజాగా 'మిల్కీ బ్యూటీ' రూపంలో డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాపై చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్.. ఇన్ స్టంట్ హిట్ నంబర్ అని చెప్పలేం గానీ.. పక్కా స్లో పాయిజన్ మెలోడీ అని చెప్పొచ్చు. మహతి స్వర సాగర్ సంగీతంలో విజయ్ ప్రకాశ్, సంజనా కల్మంజీ ఆలపించిన ఈ పాటలో చిరంజీవి, తమన్నా మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్త రొటీన్ గానే సాగినప్పటికీ.. చిరు, తమన్నా కాంబో ఫ్రెష్ నెస్, విజువల్స్ ఈ లిరికల్ వీడియోని పదే పదే చూసేలా చేసే ఫ్యాక్టర్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా.. వినబుల్ మెలోడీ గానే 'మిల్కీ బ్యూటీ' సాంగ్ ఉంది. ఇక నెటిజన్లు కూడా ఈ డ్యూయెట్ కి ఫిదా అవుతున్నారు. "బాస్ గ్రేస్ అస్సలు తగ్గట్లేదు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించగా.. కీర్తికి జోడీగా సుశాంత్ కనిపించనున్నాడు. అజిత్ తమిళ చిత్రం 'వేదాళమ్' ఆధారంగా తెరకెక్కిన 'భోళా శంకర్' ఆగస్టు 11న థియేటర్స్ లోకి వస్తోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో 'భోళా శంకర్'పై మంచి అంచనాలే ఉన్నాయి.