English | Telugu

ఎఫైర్‌కైనా రెడీ

"దేనికైనా రెడీ" చిత్రంలో జంటగా నటించిన విష్ణు, హన్సికల నడుమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో ఈ ఇద్దరూ మరోసారి జతకడుతున్నారు. హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన "గోల్‌మాల్-3" చిత్రం రీమేక్‌లో తన ఇద్దరు తనయులు విష్ణు, మనోజ్‌లతోపాటు మోహన్‌బాబు కలిసి నటిస్తుండడం తెలిసిందే. ఈ ముగ్గురుతోపాటు ఈ చిత్రంలో వరుణ్‌సందేశ్, తనీష్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో మోహన్‌బాబుకు జంటగా రవీనాటండన్ నటిస్తుండగా.. మనోజ్‌ పక్కన ప్రణీత నటిస్తోంది. ఇక విష్ణు సరసన హన్సిక సరసాలాడుతోంది.

"లక్ష్యం" ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. విష్ణు, హన్సిక వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తుండడం.. ఆ రెండు చిత్రాలు మాతృసంస్థకు చెందినవి కావడంతో... ఈ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" అనే గుసగుసలు మొదలయ్యాయి. "దేనికైనా రెడీ" చిత్రంతో మొదలైన వీరిద్దరి "కెమిస్ట్రీ" ఎఫైర్‌కైనా రెడీ అనే స్థాయికి వెళ్తుందేమో చూడాలి!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.