English | Telugu

బాలయ్యతో మిరపకాయ్ లేడి

ఇటీవలకాలంలో పెద్ద హీరోలు నటించే చిత్రంలో మినిమం ఇద్దరు ముగురు హీరోయిన్లుండడం సర్వసాధారణమైపోయింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్స్ ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు వారాల్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో "హీరోయిన్స్" అంటూ పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. వాటిలో ఇప్పుడు దీక్షాసేథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మెయిన్ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే అవకాశముందనే ఊహాగానాలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అసలే మొదటి హీరోయిన్ ఇంకా కాకుండానే, రెండవ హీరోయిన్, మూడవ హీరోయిన్ అంటూ బాలయ్య సినిమాకు హీరోయిన్స్ ను వెతుకుతున్నారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన "సింహా"లో నటించిన నయనతార. ఆ తర్వాత బాపు దర్శకత్వం "శ్రీరామరాజ్యం"లోనూ సీతగా నటించి మన్ననలు పొందింది. ముచ్చటగా మూడోసారి మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ నయనతార నో చెప్తే మొదటి హీరోయిన్ గా టబు లేదా సమీరా రెడ్డి ల పేరు వినిపిస్తున్నాయి. మరి వీరందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.