English | Telugu

మనోజ్ నిశ్చితార్థంలో మంచు లక్ష్మి కంటతడి

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అయిన మనోజ్ నిశ్చితార్థం ఈరోజు ప్ర‌ణ‌తితో హైద‌రాబాద్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతోంది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌నోజ్ - ప్ర‌ణ‌తి జంట‌ను ఆశీర్వ‌దించారు. ఇది ఇలా ఉంటే తన చిన్న సోదరుడి నిశ్చితార్ధం వేడుకలో మంచు లక్ష్మి ఆనందం తట్టుకోలేక ఉద్వేగానికి లోనయి పక్కనే ఉన్న సోదరుడిని పట్టుకుని ఏడుస్తూ ఆనందభాష్పాలు రాల్చింది. మంచు వారి ఆడపడుచు లక్ష్మీప్రసన్నకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. బంధాలు, అనుబంధాలను ఆమె చక్కగా పాటిస్తుంటారు. అందులోనూ తన తమ్ముళ్లంటే ఆమెకు ఎనలేని అభిమానం. విష్ణుకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను కూడా ఎక్కువగా ఆమే చూస్తుంటారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .