English | Telugu

ఆ సినిమా..నాయుడు గారికి అంకితం

ఎన్నో అద్భుత‌మైన ప్రేమ‌క‌థా చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌.. రామానాయుడు. ఇప్పుడు ఆయ‌న ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని అంకిత‌మివ్వ‌బోతున్నారు. సుధీర్‌బాబు, నందిత జంట‌గా న‌టించిన చిత్రం కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని. క‌న్న‌డ విజ‌య‌వంత‌మైన చార్ మినార్‌కి ఇది రీమేక్‌. ఇదో చ‌క్క‌టి ల‌వ్‌స్టోరీ. అందుకే మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడుకి ఈ చిత్రం అంకితం ఇస్తున్న‌ట్టు చిత్ర నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. ''నాయుడు గారంటే నాకెంతో గౌర‌వం. ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టా. ఆయ‌న లేని లోటు ఎవ్వ‌రూ తీర్చ‌నిది. ఆయ‌న‌కు మా సినిమా అంకితం ఇస్తున్నాం'' అంటున్నారు శ్రీ‌ధ‌ర్‌. ఈనెల 12న ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక నిర్వ‌హిస్తున్నారు. ఈనెలాఖ‌రున చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.