English | Telugu

గాయపడ్డ మంచు లక్ష్మీ ప్రసన్న

ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యాదాత, రాజకీయ నాయకుడు అయిన పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు కుమార్తె, "ప్రేమతో మీ లక్ష్మి" వంటి చక్కని కార్యక్రమానికి యాంకర్ గా ఉంటూ, తన తమ్ముడు మంచు మనోజ్ కుమార్ హీరోగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, "ఝుమ్మంది నాదం" వంటి సినిమాని నిర్మించి, "దొంగల ముఠా" చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించి, ప్రస్తుతం "గుండెల్లో గోదారి" చిత్రంలో ప్రథాన నాయికగా నటించబోతుంది. అలాంటి లక్ష్మీ ప్రసన్నకు, మే 11 వ తేదీన, ఇంట్లో మెట్లు దిగే సమయంలో క్రిందపడగా, ముక్కుకు బలమైన గాయం అయ్యింది.

లక్ష్మీ ప్రసన్నను వెంటనే కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికేం ఢోకా లేదనీ, అది చిన్న గాయమేననీ, ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. కానీ కొన్ని రోజుల పాటు లక్ష్మీ ప్రసన్న విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న త్వరగా కోలుకుని తను తొలిసారిగా హీరోయిన్ గా నటించబోయే "గుండెల్లో గోదారి" సినిమాలో నటించాలని ఆశిస్తూంది తెలుగు వన్ డాట్ కామ్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.