English | Telugu

'మామా మశ్చీంద్ర' మూవీ రివ్యూ .. అదో మాదిరి మావ 

తారాగణం: సుదీర్ బాబు ,ఈషా రెబ్బ,మృణాళిని,రవి ,హర్షవర్ధన్ అలీ రెజా,రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: చైతన్య భరద్వాజ్
ఎడిటర్: మార్తాండ్.కె. వెంకటేష్
డీఓపీ: పి.జి విందా
రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు:సునీల్ నారంగ్,రామ్ మోహనరావు
బ్యానర్ :శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023

కొన్ని కొన్ని సినిమాలకి ఆ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ ని మేకర్స్ భారీ స్థాయిలో ఇవ్వకపోయినా ప్రేక్షకులు మాత్రం తాము అనుకున్న సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అలా ప్రేక్షకులు ఎదురు చూసిన సినిమా మామామశ్చీంద్ర. ప్రేక్షకులు అంతగా ఎదురు చూడటానికి ప్రధాన కారణం సుధీర్ బాబు మొదటి సారిగా త్రిపాత్రాభినయం చెయ్యడంతో పాటుగా గురు, మనం లాంటి సూపర్ హిట్ సినిమాలకి డైలాగ్స్ ని అందించిన ప్రముఖ నటుడు హర్షవర్ధన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దామా..


కథ:
పరశురామ్(సుధీర్ బాబు ) తండ్రి చాలా చెడ్డ వ్యక్తి . ఒక రకంగా చెప్పుకోవాలంటే పరమ క్రూరుడు. అతని మూలంగా చిన్న వయసులోనే పరశురామ్ తల్లిని కోల్పోతాడు. దాంతో పరశురామ్ కి చెందాలసిన ఆస్తిని అతని మేనమామ(అజయ్) కాజేస్తాడు. ఆ తర్వాత పరశురామ్ తమ మామ కూతుర్ని పెళ్లి చేసుకొని ఆస్థి మొత్తం తన పేరున రాయించుకుంటాడు. కొన్ని రోజులకి పరశురామ్ భార్య ఒక ఆడపిల్లని ప్రసవించి చనిపోతుంది. దీంతో పరశురామ్ తన ఆస్తులు మొత్తాన్ని అమ్ముకొని కూతురుతో సహా ఫారెన్ వెళ్ళటానికి చూస్తాడు. అన్ని రెడీ చేసుకుంటుండగా పరశురామ్ మీద హత్యాయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో తన కూతురుకి దూరంగా ఉన్న పరశురామ్ కి యుక్తవయసు కి వచ్చిన తన కూతురు ఎవరో తెలియకుండా పోతుంది. ఇంకో పక్క తన రూపు రేఖలతోనే ఉన్న డీజే, దుర్గ అనే వాళ్ళని పరశురామ్ చంపాలని చూస్తుంటాడు. అసలు ఆ ఇద్దర్ని పరశురామ్ ఎందుకు చంపాలని చూస్తున్నాడు. తన మీద జరిగిన హత్యాయత్నానికి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందా?, అలాగే హీరోయిన్ రోల్స్ పోషించిన ఈషా రెబ్బ మరియు మృణాళిని లో పరశురామ్ కూతురు ఎవరు అనేది మిగతా కథ.

విశ్లేషణ
ఒక చెడ్డ కథని మంచి స్క్రీన్ ప్లే తో హిట్ చెయ్యవచ్చు. అలాగే ఒక మంచి కథని చెడ్డ స్క్రీన్ ప్లే తో ప్లాప్ చెయ్యచ్చు. ఈ సూత్రం సినిమా పుట్టిన దగ్గర నుంచి అలాగే వస్తు ఉంది. దీనికి రుజువుగా ఎన్నో సినిమాల ఫలితాలు కూడా వచ్చాయి. మామా మశ్చీంద్ర మూవీ విషయానికి వస్తే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే సినిమాలో విషయం ఉందనే మాటర్ ఆడియన్స్ కి అర్ధం అవుతుంది. కానీ నిదానంగా సినిమాలోకి వెళ్లే కొద్దీ మనకి సినిమా పోబోతుందని తెలిసిపోతుంది. ఆ విధంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది. కథ యొక్క ఉద్దేశం ప్రకారం దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ ఆయన సృష్టించుకున్న గందరగోళంలో ఆయనే పడతాడు. అన్ని పాత్రలని ఒకేసారి తెర మీద చుపించాలసిన అవసరం లేదు. సముద్రం తన కెరటంతో ఉధృతాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు నిదానంగా ముందుకొచ్చి అంతే నిదానంగా వెనక్కి వెళ్లి చివరకి ఎలా అయితే తన ప్రతాపాన్ని చూపిస్తుందో అంతే స్థాయిలో ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకుంటే సరిపోయేది. కానీ అర్ధం కానీ స్క్రీన్ ప్లే ని దర్శకుడు రాసుకోవడం వల్ల సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.అలాగే దర్శకుడు హర్షవర్ధన్ సరైన కథ ను తయారు చేసుకోలేదు. మనం,గురు సినిమాల్లోని తరహాలోలాగా కూడా ఈ సినిమాలోని డైలాగ్స్ లేవు. ఆయన డైరక్షన్ కూడా ఏమి బాగోలేదు. ఏమి లేని కథ కి హడావిడి ఎక్కువ అన్నట్టుగా ఉంది.

నటీనటుల పనితీరు
సుధీర్ బాబు తొలిసారిగా మూడు పాత్రల్లో నటించినా, మూడు పాత్రల్లో కూడా చాలా చక్కగా నటించాడు. కానీ పరశురామ్ క్యారెక్టర్ లో మాత్రం ఆయన్ని చూడాలంటే కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.పైగా కాస్ట్యూమ్ గాని మేకప్ గాని సుధీర్ కి సూట్ కాలేదు. మిగతా రెండు పాత్రల్లో మాత్రం సూపర్ గా నటించాడు.ముఖ్యంగా మూడో పాత్రలో తన రెగ్యులర్ సిక్స్ పాక్ బాడీ తో మెరిసి ప్రేక్షకులకి కనువిందులు చేసాడు. ఇంక ఈషా రెబ్బ,మృణాలిని లు తమ పాత్రల వరకు బాగానే నటించారు. మిగతా పాత్రలు ఉన్న అవి అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలే.


తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
సుధీర్ బాబు కష్టం తెరమీద కనపడినా కూడా అర్ధం లేని స్క్రీన్ ప్లే తో మామామశ్చీంద్ర ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యింది అన్నటుగా ఉంది సినిమా పరిస్థితి. పెద్ద హీరోల సినిమాలే ఒక మాదిరిగా ఉన్నా జనం థియేటర్స్ కి వెళ్ళటం లేదు మరి అంతంత మాత్రమే ఉన్న ఈ మామామశ్చీంద్రని జనం ఆదరించడం కష్టమేమో...


రేటింగ్: 2.25/5

- అరుణాచలం

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .