English | Telugu
బిడ్డకి జన్మనిచ్చి చనిపోయిన సీరియల్ నటి..ఐసీయూ లో బిడ్డ
Updated : Nov 1, 2023
మలయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్ననే ప్రముఖ బుల్లితెరనటి మంజూష మీనన్ ఆకస్మిక మృతి విషయం మరువక ముందే ఇప్పుడు మరో బుల్లి తెర నటి మరణించడం మలయాళ చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.
మలయాళ బుల్లి తెర మీద నటించే ప్రియ అందరికి సుపరిచితమే. ఎనిమిదినెలల గర్భిణిగా ఉన్న ప్రియ చెకప్ కోసం హాస్పిటలకి వెళ్లి ఒక్క సారిగా గుండెపోటుకు గురయ్యి కుప్పకూలిపోయింది. దాంతో డాక్టర్స్ ప్రియ కి ట్రీట్మెంట్ చేసినా కూడా ఫలితంలేకపోవడంతో ప్రియ చనిపోయింది. అత్యంత విషాదకరం ఏంటంటే ప్రియ ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది. పుట్టిన బిడ్డ కూడా ఐసీయూ లో ఉండటం అందర్నీ మరింతగా కలిచివేస్తుంది.
వల్లి,ప్రియమనవల్, భైరవి ఆవిగాళుక్కు,పరస్పరం, పసమలార్ ఇలా ప్రియ నటించిన సీరియల్స్ అన్ని కూడా విశేష ప్రజాధరణ పొందడమే కాకుండా ప్రియ ఎంతో మంది ప్రేక్షకులని తన నటనతో అభిమానులుగా మార్చుకుంది.