English | Telugu

మహేష్ తో ముగ్గురు హాట్ బ్యూటీస్‌

సూపర్ స్టార్ Mahesh Babu బ్రహ్మోత్సవ౦ సెట్స్ పైకి వెళ్ళకముందే భారీ క్రేజ్ ను రాబట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగానే రిలీజ్ డేట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు ప్రొడ్యూసర్. లేటెస్ట్ గా ఈ సినిమా కోసం ముగ్గురు టాప్ హీరోయిన్లను ఎంపిక చేసి మరింత క్రేజ్ తీసుకువచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.

'బ్రహ్మోత్సవ౦' లో హీరోయిన్ గా మొదట రకుల్ ప్రీత్ ఛాన్స్ కొట్టేసింది. అయితే ఏమైందో కానీ సడన్ గా ఆమెను స్థానంలో సమంతను ఎంపిక చేశారు. ఆ తరువాత ఇంకో క్యారెక్టర్ కు ప్రణీత ఓకే అయ్యింది. ఇక మూడో హీరోయిన్ విషయంపై రకరకాల వార్తలు వినిపించాయి. రాశి ఖన్నా ఆ ఛాన్స్ కొట్టేసిందని కూడా వినిపించింది. కానీ మంచి ప్రాధాన్యం వున్న పాత్ర కావడంతో పాత హీరోయిన్ అయితే బెటరని డిసైడ్ అయ్యారట.

ఐతే దాని కోసం అనేక పేర్లను పరిశీలించిన శ్రీకాంత్ అడ్డాల ఆఖరికి కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేశాడట. బిజినెస్ మ్యాన్ తరువాత మహేష్ తో మళ్ళీ ఆఫర్ రావడంతో కాజల్ వెంటనే ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని ఇండస్ట్రీ ప్రముఖ పీ ఆర్ ఓ బీఏ రాజు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.అలాగే ఈ సినిమా జులై 10నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని వెల్లడించాడు. బృందావనంలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన కాజల్, సమంత..ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు తో కలిసి నటించబోతున్నారు. దీంతో బ్రహ్మోత్సవ౦ పై సూపర్ స్టార్ అభిమానులలో అంచనాలు ఓ రెంజుకి చేరుకుంటున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.