English | Telugu

నమ్రత కోరిక తీరుస్తున్న మహేష్ బాబు

ప్రముఖ తెలుగు సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబుని బాలీవుడ్ సినిమాల్లో హీరోగా చూడాలన్నది అతని భార్య నమ్రత కోరిక. మహేష్ బాబు ఫేస్ కట్ గానీ, గ్లామర్ కానీ బాలీవుడ్ హీరోగా నూటికి నూరుపాళ్ళు సరిపోతాయని నమ్రత అభిప్రాయం. కానీ మహేష్ బాబు ఎందుకనో నమ్రత కోరికను మన్నించలేదు. అయినా మహేష్ బాబు చేత బాలీవుడ్ చిత్రాల్లో నటింపజేయాలని నమ్రత చాలా ప్రయత్నాలు చేసిందని వినికిడి.

అయినా నమ్రత మాటలను ఏనాడూ మహేష్ బాబు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా, మణిరత్నం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మణిరత్నం హిందీలో కూడా తీస్తున్నాడట. ఈ విధంగా అనుకోకుండా భార్య నమ్రత కోరికను మహేష్ బాబు తీరుస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు మరో హీరో విక్రమ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తీస్తాడట మణిరత్నం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.